SINGLE SHOT FILM
ఓపెన్ చేస్తే, ఒక అడివి, అడవిని ఎస్టాబ్లిష్ షాట్స్ (30 sec), అక్కడున్న అడవిని కెమెరాతో అలా చిన్నగా మూమెంట్ ఇస్తూ, స్లోగా రైట్ కి కెమెరాని pan చేస్తూ, అడివిలో ఉన్న గ్రాస్ లో ఏదో ఉంటుంది, అది ఏది అన్నట్లు, కెమెరాని కొంచెం, జూమ్ చేస్తూ చూస్తే అక్కడ . అప్పుడే పడి ఉన్న బ్లడ్ మరకలు ఉంటాయి, ఆ గ్రాస్ నుంచి వెంటనే లెఫ్ట్ కి కెమెరా ని pan చేస్తే , అక్కడ క్యాంపు ఫైర్ ఉంటుంది, ఆ క్యాంపైర్ నుంచి కెమెరా ని చిన్నగా మూమెంట్ ఇస్తూ పైకి pan చేస్తే, అక్కడ రెండు చెట్ల కట్ల మధ్య , ఒక కాలు బ్లడ్ కారుతూ, కాలుతూ ఉంటుంది, కొంచెం రైట్ కి ఫ్యాన్ చేస్తే కెమెరానే, అక్కడ ఒక వ్యక్తి, మనిషి hand నీ తింటూ ఉంటాడు, దాని నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది, అక్కడ ఉన్న వ్యక్తి ఫేస్ రివిల్ చేయకుండా, ఆ వ్యక్తి తినే హ్యాండ్ మాత్రమే ఫోకస్ చేస్తాం, ఆ వ్యక్తి బ్లర్ లో ఉంటాడు,
అలా ఒక 30 సెకండ్స్, ఆ వ్యక్తి తినడం చూపిస్తాము, ఏదో car సౌండ్ వస్తుందని, అలా కెమెరాను కొంచెం pan చేస్తే ఒక 50 మీటర్ల దూరంలో ఒక కారు స్పీడ్ గా వచ్చి ఆగుతుంది, అక్కడ తింటున్న వ్యక్తి ఎవరో వచ్చారు అని నవ్వుతూ, తింటున్న చేతిని అక్కడ పడేసి ఆ కారు దగ్గరకు వెళ్తాడు, కెమెరా ఆ వ్యక్తి వెనకాల ఫాలో చేసుకుంటూ వెళ్తుంది, ఆ వ్యక్తి ఒక చెట్టు చాటు నుంచి, ఆ కారుని చూస్తూ ఉంటాడు, ఆ కార్ లో నుంచి 30 sec ఎవరు దిగరు, కెమెరా ఆ కార్ బ్యాక్ సైడ్ నుంచి కొంచెం పాన్ చేసుకుంటూ స్టే( mid wide) అవుతుంది, అప్పుడు ఆ కార్ డోర్ ఓపెన్ అవుతుంది, కార్ కి ఉన్న సైడ్ మిర్రర్ లో అమ్మాయి పేస్ కనిపించేలాగా దిగుతుంది, అమ్మాయికి కెమెరా బ్యాక్ సైడ్ mid wide లో ఉంటుంది , అమ్మాయి ఒక షార్ట్, ఒక స్లీవ్ లెస్ టీషర్ట్ వేసుకొని ఉంటుంది, అమ్మాయి నేచర్ ని ఆస్వాదిస్తూ ఉంటుంది, అమ్మాయి ఫోన్ రింగ్ అవుతుంది, అమ్మాయి తన షార్ట్ నుంచి మొబైల్ తీసి వీడియో కాల్ మాట్లాడుతుంది, కెమెరా, స్లోగా (wide to close) అమ్మాయి షోల్డర్ దగ్గరకు వెళ్లి స్టే అవుతుంది, అమ్మాయి వీడియో కాల్ లో తన బాయ్ ఫ్రెండ్ తో కోపంగా మాట్లాడుతూ ఉంటుంది,
అబ్బాయి: ఎక్కడున్నావే, ముందే నీకు భయం ఎక్కువ
అమ్మాయి: ఎక్కడుంటే నీకెందుకు
అబ్బాయి: అలిగి అలా వెళ్ళిపోతే ఎలా baby
అమ్మాయి: ఆ ఆ వెళ్లిపోక, ఇంకేం చేయాలి, ఎప్పుడూ నాదే తప్పు
అంటావు, నీతో నావల్ల కాదు ఇంకా, నేను ఒంటరిగా
ఉందామని వచ్చా, . నన్ను ఇంకా వదిలేయ్
అబ్బాయి: పక్కన పాము ఉంది చూడు
అని భయపడుతూ చెప్తాడు అబ్బాయి, వీడియో కాల్ లో, ఆ అమ్మాయి నిజంగా ఉందేమో అని భయపడుతుంది ఫుల్ గా , వెనక్కి తిరిగి చూడగ అక్కడ ఏ పాము ఉండదు, అమ్మాయి వెనక్కి తిరిగినప్పుడు, కెమెరా కొంచెం pan చేస్తూ అమ్మాయి ముందుకి కి వచ్చి స్టే అవుతుంది, అమ్మాయి వెనక్కి చూసినప్పుడు, ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ఆ వ్యక్తి వెళ్లిపోవడం ఆ అమ్మాయి చూస్తుంది, కానీ ఎవరో మనుషులే అని , ముందుకి తిరిగి వీడియో కాల్ లో మాట్లాడుతుంది,
అబ్బాయి: చూడు పాము అంటేనే అలా భయపడ్డావ్, నువ్వు ఉన్న
అడవిలో, మనుషుల్ని తినే రాక్షసులు ఉన్నారంట,
తొందరగా రా
అమ్మాయి: నన్ను టూర్ కి పిలుచుకొని వచ్చి, నీ ఎక్స్ తో రొమాన్స్
చేస్తావా, ఇంక నీ మొహం అస్సలు చూపించకు నాకు,
అబ్బాయి: నా ex ఇక్కడ hotel మేనేజర్ అని నాకేం తెలుసే , ఏదో
పాత friends కదా క్లోజ్ గా మాట్లాడాం అంతే
అమ్మాయి: ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు లే, నువ్వు ఎంత
భయపెట్టినా, నేను ఇంకా భయపడను నీ ఎక్స్ తోనే ,
రొమాన్స్ చేసుకో, ఈ ఫోన్ ఉంటేనే కదా నువ్వు నన్ను
డిస్టర్బ్ చేస్తావ్
అంటూ ఆ అమ్మాయి ఫోన్ ని పగలగొడుతుంది, ఆ ఫోన్ పగిలిపోయిన సౌండ్ వస్తుంది, అమ్మాయికి కోపం వస్తుంది దాన్ని, కంట్రోల్ చేసుకుని, తనకు తానే కూల్ కూల్ అని అనుకుంటూ ఉంటుంది, అమ్మాయి కూల్ అయిన తర్వాత, car lo ఉన్న కెమెరాని, తన hand బ్యాగ్ ని తీసుకుని, కార్ కి లాక్ చేసి , a key ni హ్యాండ్ బ్యాగ్ లో వేసుకొని, అలా ముందుకి వెళ్తూ ఉంటుంది, కెమెరా ఆ అమ్మాయి కోప్పడేటప్పుడు కంట్రోల్ చేసుకునేటప్పుడు, లో యాంగిల్ లో షార్ట్స్, అమ్మాయి కారులో ఉన్న బ్యాగ్ ని తీసుకునేటప్పుడు, కెమెరా లెఫ్ట్ కి pan చేస్తూ, కెమెరా కాల్ లోపలికి, వెళ్లి ఆ బ్యాగ్ ని ఫాలో అవుతూ , బయటికి వచ్చి , బ్యాగులో కార్ కీస్ ని పడేయడం, జిప్ వేయడం క్లోజ్ లో తీసుకుంటాం, అమ్మాయిని అలా ఫాలో అవుతూ బ్యాక్ షాట్స్, అండ్ ఫ్రంట్, ఆ అమ్మాయి ఒకచోట ఆగి కెమెరా తీసి ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది, అలా త్రీ ఫోర్ టైమ్స్ , అందమైన లొకేషన్ ని ఫొటోస్ తీస్తూ వెళ్తూ ఉంటుంది, అమ్మాయికి నడిచి నడిచి ఒకచోట కూర్చుంటుంది, బ్యాగులో తెచ్చుకున్న చిప్స్ ని తింటూ, వెదర్ ని అండ్ లొకేషన్స్ ని చూస్తూ ఉంటుంది, అంతలో ఒక చెయ్యి అమ్మాయి బ్యాక్ సైడ్ నుంచి ముందుకి వస్తుంది ( కెమెరా ఫస్ట్ వైట్ and అమ్మాయి కి ఫ్రంట్ టు షోల్డర్ టు క్లోజ్ (ఆ హ్యాండ్ అమ్మాయి దగ్గరకు వచ్చేటప్పుడు) ) ఆ అమ్మాయి ఆ ఆ చెయ్యి ఎవరిది అని పులికిపడి పైకి లేస్తుంది( 2 shot) , ఒక వ్యక్తి ఒంటినిండా totos ఉంటాయి, ఆ అమ్మాయి ఆ వ్యక్తిని చూసి భయపడుతుంది, ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ఏదో ఒకలా చూస్తూ ఉంటాడు (కన్నింగా), అమ్మాయి కొంచెం భయపడుతూ
అమ్మాయి: ఎవరు నువ్వు
వ్యక్తి: మేడం ఇక్కడకు రాకూడదు, వెళ్లిపోండి
అమ్మాయి: నువ్వెవరు, నా ఇష్టం నేనుంటా, నా బాయ్ ఫ్రెండ్
పంపించాడు నిన్ను
వ్యక్తి: నన్నెవరూ పంపలేదు మేడం ఇక్కడ ఉండకూడదు
వెళ్లిపోండి
అమ్మాయి: నా ఇష్టం
అంటూ ఆ వ్యక్తి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతుంది, అప్పుడు ఆ వ్యక్తి ఒక భయంకరంగా నమ్ముతాడు( ఆ వ్యక్తిని క్లోజ్ షాట్స్), కెమెరా ఆ వ్యక్తి దగ్గర నుంచి అమ్మాయిని ఫాలో అవుతుంది. ఆ అమ్మాయి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది, అప్పుడు కొన్ని సౌండ్ స్ వస్తాయి, ఆ అమ్మాయి భయపడి ఒక చెట్టు పక్కన దాక్కుంటుంది
( 60 sec), కొంతసేపటికి ఆ sounda ఆగిపోతాయి, అమ్మాయి తనకు తన ధైర్యం చెప్పుకొని (30 sec),
ఆమె ముందుకు వెళుతూ ఉంటుంది నేచర్ ని చూస్తూ, ఫొటోస్ తీసుకుంటూ. కెమెరా ఫాలో చేస్తూ ఉంటుంది,
సడన్గా ఒక దగ్గర ఆగి, కొంచెం భయపడుతూ ఉంటుంది( కెమెరా కొంచెం రైట్ కి ఫ్యాన్ చేస్తే) అక్కడ ఆ వ్యక్తి నిలబడి ఉంటాడు, ఆ వ్యక్తిని చూసిన ఆ అమ్మాయి భయపడుతుంది, ఆ వ్యక్తి ఆ అమ్మాయిని అలానే చూస్తూ ఉంటాడు, ఆ అమ్మాయి అందాలను, ( కెమెరా ఆ వ్యక్తి బ్యాక్ సైడ్ కి వెళ్లి సజెషన్ షాట్), ఆ అమ్మాయి భయపడుతూ ఉంటుంది,
అమ్మాయి: నువ్వు అలా చూడకు రా, నాకు భయమేస్తుంది,
నువ్వు చెప్పావు కదా వెళ్ళిపోతున్నా
అంటూ, అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది, ఆ వ్యక్తి ఫాస్ట్ గా వెళ్లి, ఆమె చేయి ని పట్టుకుంటాడు, ( mid 2 shot ) ఆమె భయపడి వాడిని, తోచినట్లు తోసి ముందుకు వెళుతూ ఉంటే, ఆ వ్యక్తి ఆమె బ్యాగ్ ని పట్టుకుంటాడు, ఆమె ఆ బ్యాగ్ ని వదిలేసి పారిపోతుంది, ఆ వ్యక్తి ఆ బ్యాగులో ఏమున్నాయో చూస్తూ ఉంటాడు, ( close to bag) ఆ బ్యాగ్ లో అమ్మాయి మేకప్ కిట్ ఉంటుంది, అవి ఓపెన్ చేసి, తినడానికి ఏమైనా పనికొస్తాయేమోని, నోట్లో పెట్టి చూస్తాడు, అవి చేదుగా ఉంటే, వాటిని విసిరేస్తాడు, అద్దంలో ఫేస్ చూసుకుంటూ, ఆ మేకప్ ప్రొడక్ట్స్ ని ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉంటాడు, (mid shot) వాడి ఫేస్ మొత్తం ఆ క్రీమ్స్, లిఫ్టిక్ అని రాసుకొని భయంకరంగా ఉంటాడు, ఆ క్రీమ్స్ అన్ని అయిపోయిన తర్వాత, వాడికి ఆ అమ్మాయి గుర్తు వచ్చి, అమ్మాయి కోసం నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు ( floow shot) , వాడికి ఆ అమ్మాయి car దగ్గర కనిపిస్తుంది, (సజెషన్ షాట్) వాడు ఒక చెట్టు పక్కన నుంచి అమ్మాయిని చూస్తూ ఉంటాడు, (కెమెరా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది) ఆ అమ్మాయి అక్కడ పగిలిపోయిన మొబైల్ తీసుకుంటుంది, అది వర్క్ చేస్తుందేమో అని చూస్తూ ఉంటుంది (close shot to mobile) , ఆ మొబైల్ స్క్రీన్ మొత్తం పగిలిపోయి ఉంటుంది, ఆ అమ్మాయి ఆ మొబైల్ చూస్తూ, అది ఎలా అయినా వర్క్ చేస్తుందని నమ్మకంతో, నా మొబైల్ ని టచ్ చేస్తూ, వర్క్ చేస్తుందేమో చూస్తూ ఉంటుంది, అప్పుడు ఆ మొబైల్ కి cal వస్తుంది, ఆ అమ్మాయి ఆ cal నీ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ టచ్ స్క్రీన్ పోవడం వల్ల ఆ కాల్ లిఫ్ట్ అవ్వదు,. ఆ అమ్మాయి భయపడుతూ బాధపడుతూ ఉంటుంది, అటు ఇటు చూస్తూ ఉంటుంది, ఆ వ్యక్తి వెంట పడుతున్నాడేమో అని, ( సజెషన్ షాట్) చెట్టు పక్కన వ్యక్తి, ఈ అమ్మాయి దగ్గరకు వస్తూ ఉంటాడు, ఆ అమ్మాయికి కనిపించకుండా, ఆ అమ్మాయి మళ్లీ కాల్ వస్తుందేమో అని ఎదురుచూస్తూ ఉంటుంది మొబైల్ పట్టుకొని, ఇంతకీ కాల్ రాకుంటే, ఆ అమ్మాయి కార్డు ఓపెన్ అవుతుందేమో అని కార్డోవర్ తీస్తూ ఉంటుంది, అన్ని డోర్స్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, ఏ డోర్ ఓపెన్ అవ్వదు, ఆ వ్యక్తి అమ్మాయి దగ్గరకు వచ్చి నిల్చుంటాడు, అమ్మాయి సడన్గా వాడిని చూశాక , భయపడి కింద పడిపోతుంది ( close shot to ammyi ) , ఆ అమ్మాయి అలా భయపడుతూ అక్కడ నుంచి, వెళ్ళిపోదామని అలా పాకుతూ ఉంటుంది, ఆ వ్యక్తి కూడా, అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాడు( సజెషన్ షాట్), ఆ అమ్మాయి పైకి లేచి పారిపోతుంది, ఆ వ్యక్తి కూడా అమ్మాయి పట్టుకోడానికి వెళ్తాడు( floow shot), అలా పరిగెడుతున్న అమ్మాయి ఒక ప్లేస్
దగ్గర ఆగుతుంది, ఆ ప్లేస్ మొత్తం బ్లడ్ తో తడిసి ఉంటాయి, అక్కడ మనిషి పుర్రెలు, చర్మం లేని కాళ్లు చేతులు ఉంటాయి, అక్కడ చిన్న చిన్న కుండలో బ్లడ్ ఉంటుంది, అదే ప్లేస్ లో ఒక రాయికి కుంకుమ పసుపు పెట్టి ఉంటుంది, అప్పుడే పూజ చేసినట్లుగా, ఒక పూలమాల కూడా ఉంటుంది, ఇద్దరు మనుషులు ఒక మనిషి లెగ్ తినడానికి గొడవ పడుతూ ఉంటారు , ఆ అమ్మాయి అది చూసి భయపడుతుంది, ఆ ఇద్దరు మనుషులు ఆ అమ్మాయిని చూసినా కూడా ఏమి మాట్లాడకుండా, చేయకుండా, వాళ్లు తింటూ ఉంటారు. ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోతుంది , one మినిట్ చేజ్ తర్వాత,( wide close) ఆ అమ్మాయి ఒక చెట్టు అడ్డు వచ్చి కింద పడిపోతుంది, ఆ వ్యక్తి అమ్మాయిని పట్టుకుంటాడు, ఆ వ్యక్తి అమ్మాయి హ్యాండ్స్ నీ ఒక తాడుతో కడుతూ ఉంటాడు, అమ్మాయి భయపడుతూ, తన హ్యాండ్స్ నీ ఆ వ్యక్తికి అందకుండా దూరం జరుగుతూ ఉంటుంది, అమ్మాయి చేతికి ఒక రాయి తగులుతుంది, ఆ రాయిని తీసుకొని, ఆ వ్యక్తి గుండెపైన గట్టిగా కొడుతుంది, ఆ వ్యక్తి స్పృహ తప్పి పడిపోతాడు, ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోతుంది, కొంచెం దూరం వెళ్ళాక,ఏదో గుర్తుకొచ్చి , ఆగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది మరి, ఆ వ్యక్తి అలానే పడిపోయి ఉంటాడు, ఆ వ్యక్తి దగ్గర car keys ఉంటాయి, అవి తీసుకుందామని ఆ వ్యక్తికి క్లోజ్ గా వెళ్తుంది, keys తీసుకోకుండా, ఆ వ్యక్తి బ్రతికి ఉన్నాడా, లేదా చనిపోయాడా అని, తన ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తుంది, శ్వాస ఆడదు, భయపడుతూ keys తీసుకుందామని చెయ్యి పెడుతుండగా , ఆ వ్యక్తి ఆ అమ్మాయి చేయని సడన్ గా పట్టుకుంటాడు, ఆ అమ్మాయి షాక్ అవుతుంది, ఆ shock లోనే ఉన్న అమ్మాయిని , ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న, మత్తుమందును ఆమె ముక్కు దగ్గర పెడతాడు, అప్పుడు అమ్మాయి స్పృహ తప్పి పడిపోతుంది, అప్పుడు ఆ వ్యక్తి అమ్మాయిని భుజం మీద వేసుకొని ఒక ప్లేస్ కి తీసుకెళ్తాడు , ఆ ప్లేస్ ఇంతకుముందు అమ్మాయి వెళ్ళిన ప్లేస్ ఒకటే,. ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ఒక దగ్గర కూర్చోబెట్టి, కాళ్లకు చేతులకు తాడు కడతాడు, ఆ వ్యక్తి అక్కడ ఉన్న బ్లడ్ తో అమ్మాయి మొహం మీద కొడతాడు అప్పుడు అమ్మాయి కి మెలకువ వస్తుంది, ఆ ప్లేస్ అంతా చూసి అమ్మాయి భయపడుతూ ఉంటుంది, అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు అమ్మాయి దగ్గరకు వచ్చి స్మెల్ చూస్తూ తినడానికి ట్రై చేస్తూ ఉంటారు, అప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఆ ఇద్దరు వ్యక్తుల పై అరుస్తాడు, వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు, ఆ వ్యక్తి అక్కడ ఉన్న పసుపు కుంకుమలను ఆ అమ్మాయికి బొట్టు పెట్టి, అక్కడే ఉన్న వేపాకు మాలను అమ్మాయి మెడలో వేస్తాడు, ఆ అమ్మాయి భయపడుతూ ,వణుకుతూ ఉంటుంది, ఆ వ్యక్తి తన దగ్గర ఉన్నcar keys నీ అక్కడ పెడతాడు, అప్పుడు ఆ వ్యక్తి ఆ రాయి ముందు కూర్చొని ఏవో మంత్రాలు చెబుతూ అక్కడున్న పసుపు కుంకుమలను, ఆ రాయిపై వేస్తూ ఉంటాడు, అమ్మాయి కట్టిన తాడును వినిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఆ వ్యక్తి సీరియస్ గా పూజ చేస్తూ ఉంటాడు, ఆ అమ్మాయిని చూపిస్తూ, స్వాహా స్వాహా అని అంటూ ఉంటాడు, ఆ అమ్మాయికి అక్కడ ఒక బ్లేడ్ కనిపిస్తుంది, దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ అది అందదు, ఆ వ్యక్తి పూజ అయిపోయిన తర్వాత, ఒక చోటికి వెళ్తాడు , అక్కడ అమ్మాయిని బలివ్వడానికి ఒక పెద్ద కత్తి ఉంటుంది, దాన్ని నీళ్లతో కడిగి, దానికి కుంకుమ పసుపు రాసి , అక్కడే ఉన్న మరో రాయి పై కత్తిని పెట్టి ఏదో మంత్రాలు చెప్తూ ఉంటాడు, ఆ మంత్రాలు అయిపోయిన తర్వాత, ఈ అమ్మాయి దగ్గరికి వస్తాడు, కానీ ఆ అమ్మాయి తప్పించుకొని ఉంటుంది, ఆ అమ్మాయి కోసం ఆ వ్యక్తి అంత వెతుకుతూ ఉంటాడు, కానీ ఎక్కడ కనిపించదు, లాస్ట్ కి అక్కడ పెట్టిన car keys కనిపించవు, అమ్మాయి ఎక్కడ పోయిందో తెలుసు అన్నట్లు, కార్ దగ్గరకు పరిగెడతాడు, కారు దగ్గరకు వెళ్లిన ఆ వ్యక్తికి ఆ అమ్మాయి ఎక్కడ కనిపించదు, ఆ అమ్మాయి కార్ కింద దాక్కొని ఉంటుంది, ఆ వ్యక్తికి car క్రింద . ఎవరో ఉన్న అనిపిస్తే ఆ కార్ కింద వెళ్లి చూస్తాడు, అక్కడ అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని చేపట్టి లాగుతూ ఉంటాడు, అమ్మాయి ఏమో car గట్టిగా పట్టుకుని ఉంటుంది, ఆ వ్యక్తి అమ్మాయిని బలంగా లాగుతాడు, అమ్మాయి బయటకి వచ్చి ఆ వ్యక్తికి ఆ బ్లడ్ తో, చిన్న గాయం చేస్తుంది కాలిపై, ఆ వ్యక్తి వేసుకున్న ప్యాంట్ చినిగిపోతుంది, అమ్మాయి అక్కడి నుంచి పారిపోతుంది, ఆ వ్యక్తి కూడా అమ్మాయిని పట్టుకోడానికి అమ్మాయి వెనకాల పరిగెడతాడు, అమ్మాయి దొరక్కుండా పడిపోతూ ఉంటుంది, ఆ అమ్మాయి ఒకచోట దాక్కొని ఉంటుంది, ఆ వ్యక్తికి అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోలేక పోతాడు, అందుకని ఒక ప్లాన్ వేస్తాడు, ఆ అమ్మాయి దాక్కొని ఉన్న చెట్టు పక్కనుంచే వెళ్తాడు, ఆ అమ్మాయి అక్కడ భయపడుతూ,ఆ వ్యక్తి తన గొంతుతో జంతువుల సౌండ్ చేస్తూ ఉంటాడు, అమ్మాయి భయపడుతూ ఉంటుంది, వాళ్ళ నాన్న చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొంటూ ఉంటుంది,
ఏ కష్టం వచ్చినా ఎవరో వచ్చి కాపాడతారని ఎదురు చూడకూడదు, మనకు మనమే ధైర్యం తెచ్చుకొని ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనమే పోరాడాలి, ఎంత పిరికి వాళ్లమేనా ఒక సిచువేషన్ వచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి,. మనం పోరాడితే గాని బతకలేము అన్నప్పుడు మనం ఎంతకైనా తెగించాలి, అప్పుడే ఈ సమాజాన్ని ఎదిరించి బ్రతకలము , లేదంటే చావే దిక్కు, ఆ రెండు నీ చేతిలోనే ఉన్నాయి, ఒకటి గుర్తుపెట్టుకో ఈ సమాజంలో మనకన్నా ఎవరు బలవంతులు కాదు, మనమే అందరికంటే బలవంతులం అనుకోవాలి , అనుకోవాలి కాదు అదే నిజం.....
(ఎప్పుడూ మనం భయపడుతూ ఉంటే అందరూ మనల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తారు, ఒక్కసారి ఎదురు తిరిగి చూడు నీ బలం ఏంటో నీకు తెలుస్తుంది)
ఆ వ్యక్తి అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు, అంతలో ఒకదాన్ని చూసి భయపడతాడు,( wide shot)
అక్కడ అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని చూసి ఆ వ్యక్తి భయపడతాడు, ఎందుకంటే ఇంతవరకు భయపడుతూ ఉన్న అమ్మాయి ఇంత ధైర్యంగా ఎలా నా ముందుకు వచ్చి నిలబడింది అని భయపడతాడు, ఆ అమ్మాయి ఒక స్టెప్ ముందుకు వేస్తే ,ఆ వ్యక్తి ఒక స్టెప్ వెనక్కి వేస్తాడు, ఆ అమ్మాయి ఆ వ్యక్తి పైకి వెళ్తుంది, ఆ వ్యక్తి ఒక ఐదు స్టెప్పులు వెనక్కి వేసి, ఆ అమ్మాయి నీ పట్టుకుంటాడు, ఆ అమ్మాయి తన చేతిలో ఉన్న బ్లేడుతో ఆ వ్యక్తి మెడ పైన గీస్తుంది, ఆ వ్యక్తి అక్కడికక్కడే కింద పడిపోతాడు , ఆ వ్యక్తి మెడ నుంచి బ్లడ్ వస్తుంది, ఆ వ్యక్తి గిల గిల కొట్టుకుంటూ ఉంటాడు, అమ్మాయిని పట్టుకోడానికి ఎక్కుతాడు, పని తన వల్ల కాదు, ఆ అమ్మాయి అదంతా చూస్తూ, ధైర్యం తెచ్చుకొని, ఆ వ్యక్తి దగ్గర ఉన్న car keys తీసుకొని సార్ దగ్గరికి వెళ్లి, car ni స్టార్ట్ చేసుకొని వెళుతుంది, కొంచెం దూరం పోయిన తర్వాత, ఆ వ్యక్తి మళ్లీ అమ్మాయి ఎదురు వస్తాడు, ఆ car ni పట్టుకోడానికి ట్రై చేస్తాడు, కానీ అమ్మాయి car ni స్పీడ్ గా పోనిస్తుంది, ఆ వ్యక్తి పరిగెత్త లేక అక్కడే ఆగిపోతాడు, ఆ అమ్మాయి అలా స్పీడుగా పోతూ ఉండగా, ఒక దగ్గర రోడ్డుపైన, ఇద్దరు కానిస్టేబుళ్లు ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్, ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కారుని చూసి, ఆపుతాడు , ఆ అమ్మాయి క్రిందకి దిగి తన బాయ్ ఫ్రెండ్ ని హగ్ చేసుకుంటుంది, అక్కడ ఉన్న పోలీసులు , ఈ ఏరియా రిజిస్టర్ ఏరియా మేడం మీరు ఎందుకు వెళ్లారు, అని క్యూస్షన్స్ వేస్తూ ఉంటారు, ఆ అమ్మాయికి, దూరంగా ఆ వ్యక్తి కనిపిస్తాడు, అమ్మాయి ఆ వ్యక్తిని చూసి భయపడకుండా ధైర్యంగా రెండు అడుగులు ముందుకు వేస్తుంది....
THE END